![]() |
![]() |
.webp)
'గుప్పెడంత మనసు' సీరియల్.. ఇప్పుడు స్టార్ మా టీవీలో వస్తున్న ఈ సీరియల్ అత్యంత వీక్షకాదరణ పొందుతోంది. అయితే మంగళవారం జరిగిన ఎపిసోడ్-656 లో "రిషి ఎక్కడున్నాడు" అని జగతిని అడుగుతుంటుంది దేవయాని. అప్పుడే రిషి ఇంటికొస్తాడు. రిషిని చూసిన దేవయాని ఎమోషనల్ అవుతుంది. "రిషి ఎక్కడికెళ్లావ్? ఇలా అయిపోయావ్ ఏంటి. ఏమైనా తిన్నావా? లేదా" అని దేవయాని అడుగుతుంది. రిషి మౌనంగా ఉంటాడు. అక్కడే ఉన్న మహేంద్ర కూడా "ఎక్కడున్నావ్ రిషి? ఎక్కడికెళ్లావ్?" అని అడుగుతాడు. "ఉన్నాను కదా డాడీ" అని రిషి చెప్తాడు. "ఏంటీ రిషి? ఏం మాట్లాడుతున్నావ్? " అని జగతి అడుగుతుంది. "వద్దు మేడం. నాకు ఇది అలవాటు అయింది. అందరూ మధ్యలోనే వదిలేసి వెళ్తున్నారు. ఒకరు బాల్యం లేకుండా చేసారు. ఇంకొకరు జీవితాంతం తోడుంటానని చెప్పి స్వార్థం చూపించారు. ఆ స్వార్థం పేరే సాక్షి. ఆ తర్వాత మీ శిష్యురాలిని కాలేజీకి తీసుకొచ్చి పరిచయం చేశారు. అప్పుడు మనసులో మీకు థాంక్స్ చెప్పుకున్నా. ఇప్పుడు నాకు మంచి గుణపాఠం చెప్పింది. థాంక్స్ మేడం" అని రిషి చెప్పేసి అక్కడ నుండి వెళ్తాడు.
మరో వైపు రిషి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఉంటుంది వసుధార. "మీ జ్ఞాపకాలతో బ్రతికేస్తా సర్" అని ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత దేవయానిని పిలిచి "రిషి లేచాడా" అని రిషి పెద్దనాన్న అడుగుతాడు. "రిషి గురించి ఎవరు పట్టించుకుంటున్నారు" అని వెటకారంగా మాట్లాడుతుంది దేవయాని. ఆ తర్వాత రిషి దగ్గరికి మహేంద్ర వెళ్తాడు. రిషి రూంలోకి వెళ్ళి చూస్తే రిషి కింద పడుకొని ఉంటాడు. రిషి అలా కిందపడుకోవడం చూసిన మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. "రిషి.. ఏంటీ నాన్న ఇక్కడ పడుకున్నావ్" అని మహేంద్ర అడుగుతాడు. "ప్రేమిస్తే ఇంత బాధగా ఉంటుందా డాడి. ప్రేమిస్తే బాధ ఉంటుందని.. ప్రేమించడం మానేస్తే, అది ప్రేమ ఎలా అవుతుంది డాడీ. వసుధార గురించి ఆలోచించి.. ఆలోచించి అలసిపోయాను డాడీ. సాక్షి వెళ్ళాక నా జీవితం శూన్యం అయింది. వసుధార వచ్చాక రంగుల ప్రపంచం చూపించింది. ఇప్పుడు ఇలా చేస్తుందని అనుకోలేదు డాడి" అని రిషి ఏడుస్తాడు. ఆ తర్వాత దేవయానికి రాజీవ్ కాల్ చేసి వసుధారకి "బెయిల్ ఇప్పించండి" అని అడుగుతాడు. "నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్లేసరికి లాయర్ గారు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేస్తారు" అని దేవయాని చెప్తుంది. "ఒకే మేడం"అని రాజీవ్ కాల్ కట్ చేస్తాడు. వసుధారని లాయర్ బెయిల్ మీద బయటికి విడిపిస్తాడు.
వసుధార, రాజీవ్ బయటకొస్తారు. "పదా వసుధార.. మీ అమ్మనాన్న దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ముందే పెళ్లి చేసుకుందాం" అని రాజీవ్ అంటాడు."నాకు పెళ్లి అయింది " అని చెప్తుంది వసుధార. "ఆ తాళి ఎవరూ కట్టలేదని, నాకు తెలుసు" అని రాజీవ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |